ఆత్మకూరు: సంగం సమీపంలో ఆగిపోయిన ఆర్టీసీ బస్సు, తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు
నెల్లూరు నుంచి కడప వెళుతున్న ఆర్టీసీ బస్సు సంగం సమీపంలోకి వెళ్లగానే ఆగిపోయింది. గేరు, క్లచ్ పనిచేయకపోవడంతో బస్సు ముందుకు కదల్లేదు. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సుమారు 20 మంది ప్రయాణికులు ఉండగా వారిలో ఎక్కువ భాగం ప్రభుత్వ ఉద్యోగులే. చివరికి వారంతా వేరే బస్సుల్లో గమ్య స్థానాలకు చేరుకున్నారు.