నంద్యాల అర్బన్: డోన్ లో పారిశుద్ధ్య వ్యవస్థ మెరుగుపడాలి : ఎమ్మెల్యే కోట్ల
Nandyal Urban, Nandyal | May 20, 2026
డోన్లోని 15వ వార్డులో ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి బుధవారం పర్యటించారు. వార్డులోని రోడ్లు, కాల్వలు, డ్రైనేజీ, పారిశుద్ధ్య సమస్యలపై స్థానికులతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. వార్డులో కాల్వల శుభ్రత, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.