పెద్ద కొడప్గల్: పెద్ద కొడప్ గల్ లో లబ్ధిదారునికి జనతా పర్సనల్ భీమ చెక్కు పంపిణీ
లబ్ధిదారునికి జనతా పర్సనల్ భీమ చెక్కు పంపిణీ ఆపత్కాలంలో ఇన్స్యూరెన్స్ బాధిత కుటుంబానికి అండగా నిలుస్తుందని పెద్ద కొడప్గల్ సొసైటీ ఛైర్మెన్ హన్మంత్ రెడ్డి అన్నారు.సొసైటీలో సభ్యత్వం ఉన్న శివపూర్ కు చెందిన బస్సీ మధు సింగ్ అనే రైతు ఇటీవల ప్రమాదవశాత్తు మరణించాడు.సోమవారం పెద్ద కొడప్గల్ సొసైటీ లో బస్సీ మధు సింగ్ బార్య సవితకు 2 లక్షల జనతా పర్సనల్ యాక్సిడెంట్ భీమా చెక్కును పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంగారెడ్డి,నాగిరెడ్డి,సందీప్ భారతీయ సామ సంఘం పెద్ద కొడప్ గల్ అధ్యక్షులు కుమార్ సింగ్, మళ్ళీ కార్జున్, తనజీ తదితరులున్నారు