ఒంగోలు అర్బన్: సినిమా ధియేటర్లో యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి విధి విధానాన్ని తెలిపిన జాయింట్ కలెక్టర్
Ongole Urban, Prakasam | Jul 1, 2026
సినిమా ధియెటర్స్ లో ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ, లైసెన్సుల రెన్యువల్‌కు అవసరమైన అనుమతులతో పాటు ప్రేక్షకులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, సినిమా ధియెటర్స్ యాజమాన్యాలకు సూచించారు. బుధవారం ఒంగోలు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, సంబంధిత శాఖల అధికారులు, సినిమా ధియెటర్స్ యాజమాన్యాల ప్రతినిధులతో సమావేశమై, జిల్లాలోని సినిమా ధియెటర్స్ నిర్వహణ, లైసెన్సుల రెన్యువల్, భద్రతా ప్రమాణాల అమలు, ప్రేక్షకులకు మెరుగైన సౌకర్యాల కల్పన తదితర అంశాలపై సమీక్షించారు.