గుత్తి మున్సిపాలిటీ పరిధిలో రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే క్రమంలో మున్సిపాలిటీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా గురువారం పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద రోడ్డు పక్కన ఉన్న చిరు వ్యాపారుల దుకాణాలను తొలగించారు. ఈ సందర్బంగా కమిషనర్ జబ్బార్ మియా మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ సమస్య పెరిగిపోతున్న నేపథ్యంలో చర్యలను చేపట్టామన్నారు. చిరు వ్యాపారులు, దుకాణదారులు సహకరించి ట్రాఫిక్ నియంత్రణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.