అన్నమయ్య జిల్లా, రాయచోటి: గతంలో చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఏడాది రాయచోటిలో జరిగిన అయ్యప్పస్వామి గ్రామోత్సవం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసింది. శాంతియుత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకున్న జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ను మతపెద్దలు, పీస్ కమిటీ సభ్యులు, భక్తులు ఘనంగా సన్మానించారు.ఎస్పీ మాట్లాడుతూ ప్రజల సహకారమే విజయానికి కారణమని చెప్పారు. భవిష్యత్తులో హిందూ–ముస్లిం పండుగలు అన్నీ సామరస్యంగా జరిగేందుకు పోలీసు శాఖ పూర్తి సహకారం అందిస్తుందని వెల్లడించారు. మతపెద్దలు, పీస్ కమిటీ సభ్యులు పోలీసుల ముందస్తు చర్యల