అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం దిరిసిన పల్లి గ్రామ సమీపంలో అటవీ ప్రాంతానికి దగ్గరలో భారీగా కలపను నరికి నిల్వ చేశారని అటవీశాఖ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు దీనికి సంబంధించిన వివరాలు స్థానికులు మీడియాకు తెలిపారు. తమ గ్రామ సమీపంలో అటవీ ప్రాంతానికి దగ్గరలో ఒక ప్రదేశంలో భారీగా కలపను నరికి అక్కడే నిల్వ చేసి ఉంచారని చెప్పారు. దీనిపై అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై దర్యాప్తు చేసి కలపను నరికిన వారిపై చర్యలు చేపట్టాలని కోరారు.