డోన్: డోన్ లో 30 కేజీల వెండి పట్టిలు చోరీ,దొంగల ముఠా అరెస్ట్
Dhone, Nandyal | Apr 26, 2026 నంద్యాల జిల్లా డోన్ మండల పరిధిలోని U. కొత్తపల్లి సమీపంలో భారత్ డాబా వద్ద ఆపి ఉన్న ట్రావెల్ బస్సులో ఈనెల 18న 30 కేజీల వెండి పట్టీలను చోరీ చేసిన కేసులో మధ్య ప్రదేశకు చెందిన ముగ్గురిని డోన్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.66.62 లక్షల విలువైన 30,200 గ్రాముల వెండి పట్టీలు స్వాధీనం చేసుకున్నామని DSP శ్రీనివాసులు తెలిపారు. మధ్య ప్రదేశ్ వెళ్లి చోటు దవార్ (20), రాజేశ్ చోహాన్ (32), మన్సూర్ ఖాన్(32)ను అదుపులోకి తీసుకున్నామన్నారు.