అనంతపురం అర్బన్: తల్లిదండ్రులపై కుమారుడు దాడి చేసిన ఘటన జల్లిపల్లిలో...
Anantapur Urban, Anantapur | Apr 28, 2026
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం లోని కూడేరు మండలం జల్లిపల్లి గ్రామంలో తల్లిదండ్రులపై కుమారుడు విచక్షణ రహితంగా దాడికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మంగళవారం మధ్యాహ్నం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వివరాలను బాధితులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.