తాడిపత్రి: పట్టణంలోని భగత్ సింగ్ నగర్ కు చెందిన మాజీ కౌన్సిలర్ సూర్య ప్రభాకర్ బాబుపై దాడి, పోలీసులకు ఫిర్యాదు
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని భగత్ సింగ్ నగర్ కు చెందిన మాజీ కౌన్సిలర్ సూర్య ప్రభాకర్ బాబుపై గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి దాడి చేశారు. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సూర్య ప్రభాకర్ బాబు ఇంటి సమీపంలో ఉండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి విచక్షణ రహితంగా దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దాడిలో గాయపడిన బాబును మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరామర్శించారు. చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.