వికారాబాద్: గ్రామపంచాయతీ సిబ్బందికి పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో వికారాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో వికారాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గత 5 నుంచి 8నెలలుగా పెండింగ్ జీతలు చెల్లించకపోవడంతో కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.