రాయచోటి ఎన్జీవో కాలనీలో 8వ తరగతి విద్యార్థిని లావణ్య (13) అనుమానాస్పద మృతి
రాయచోటి ఎన్జీవో కాలనీలో 8వ తరగతి విద్యార్థిని లావణ్య (13) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని తరలించే ప్రయత్నంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. తహసీల్దార్ నరసింహ కుమార్, ఎంఈఓ బాలాజీ నాయక్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.