శ్రీశైలంలో వేసవి దృష్ట్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి: దేవాదాయ శాఖ ఆఫీసియో కార్యదర్శి హరి జవహర్
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని దేవాదాయ శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి హరి జవహర్ లాల్ దర్శించుకున్నారు. వేసవి దృశ్య భక్తులకు ఇబ్బందులు కలవకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తులు దర్శనం కోసం క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండకుండా తగు చర్యలు తీసుకోవాలని, తాగునీరు వంటి కనీస సదుపాయాలు నిరంతరం అందుబాటులో ఉంచాలని సూచించారు.