డోన్: మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ బేతంచర్ల లో రైతు సంఘం ఆధ్వర్యంలో జీపు జాత
Dhone, Nandyal | Apr 8, 2026 మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో బేతంచర్లలో బుధవారం జీపు జాత నిర్వహించారు. ఈ సందర్భంగా బేతంచెర్లలో సంఘం ఉపాధ్యక్షుడు సుబ్బారాయుడు మాట్లాడుతూ..రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్న హామీని నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గిట్టుబాటు ధరతో పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. • 79 చదవని వార్తలు