పుంగనూరు: భాష్యం పాఠశాల గుర్తింపును రద్దు చేయాలి.
ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వై. విజయభాస్కర్ రెడ్డి డిమాండ్.
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని భాష్యం పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న స్వాతిక నాగశ్రీ అల్లరి చేస్తున్నదని.టీచర్ స్వాతిక నాగశ్రీ తలపై కొట్టడంతో చిన్నారి త్రీవంగా గాయపడింది. చిన్నారి స్వాతిక నాగశ్రీ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి ఆసుపత్రి ఖర్చులన్నీ పాఠశాల యాజమాన్యం భరించాలని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వై. విజయభాస్కర్ రెడ్డి తాసిల్దార్ రాము,కుశుక్రవారం మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భాష్యం పాఠశాల గుర్తింపుని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.