అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని ధర్మవరం బస్టాండ్ రోడ్డు సమీపంలో యువకుడిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇనుప రాడ్డుతో దాడి
Anantapur Urban, Anantapur | Apr 7, 2026
అనంతపురం నగరంలోని ధర్మవరం బస్టాండ్ రోడ్డులో ఆయుర్వేదిక మందులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న హిందూపురం కు చెందిన పృథ్వి అనే యువకుడి పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇనుప రాడ్డుతో విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచిన ఘటన చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.