కర్నూలు: నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి సంబంధించి పెండింగ్ లో పనులు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ సిరి
నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి సంబంధించి పెండింగ్ లో ఉన్న భూ సేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఏపిఐఐసి జెడ్ఎమ్ ను ఆదేశించారు. మంగళవారం ఉదయం 12 గంటలు కర్నూలు కలెక్టర్ ఛాంబర్ లో ఏపిఐఐసి ప్రాజెక్టులు, భూసేకరణ అంశాలపై కలెక్టర్ ఏపిఐఐసి, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ కు నీటి సరఫరా పైప్ లైన్ కు సంబంధించి పెండింగ్ లో ఉన్న 3 కిలోమీటర్ల ఉన్న భూ సేకరణ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు...