ఖైరతాబాద్: తార్నాలోని ఓయూలో నాణ్యమైన భోజనం పెట్టాలంటూ విద్యార్థుల ఆందోళన
ఓయూలోని హాస్టల్స్ మెస్లలో నాణ్యత లోపిస్తుందని పలుమార్లు విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నా సమస్య పరిష్కారం అవ్వడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. మంగళవారం రాత్రి కుళ్లిపోయిన భోజనం పెట్టారని విద్యార్థులు ధర్నాకు దిగారు. లా హాస్టల్లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉందన్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు దీనిపై తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన భోజనం అందించే వరకు ఆందోళనలు ఆపేది లేదన్నారు.