కనిగిరి పట్టణంలోని శివనగర్ కాలనీలో సంక్రాంతి క్రికెట్ పోటీలను కనిగిరి ఆర్డిఓ కేశవర్ధన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డిఓ యువతతో కలిసి సరదాగా క్రికెట్ ఆడి అలరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక వికాసంతో పాటు శారీరక ఉల్లాసానికి దోహదం చేస్తాయన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, ఓడినా, గెలిచినా యువత క్రీడా స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయ సిబ్బంది, స్థానిక యువకులు పాల్గొన్నారు.