అనంతపురం నగరంలోని కోర్టు రోడ్డులో యువకుడిపై వేడి నూనె పోసి విచక్షణారహితంగా దాడి
Anantapur Urban, Anantapur | Apr 19, 2026
అనంతపురం నగరంలోని కోర్టు రోడ్డులో వాత కక్షల నేపథ్యంలో దామోదర్ అనే యువకుడిపై గణేష్ అనే హోటల్ నిర్వాహకుడు వేడివేడి నూనెను పోసి అతనిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. తీవ్రంగా గాయాల పాలైన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. గతంలో జరిగిన ఘర్షణకు సంబంధించి పాత కక్షలు నేపథ్యం లో దాడికి పాల్పడినట్లుగా బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.