పలమనేరు: ఫేక్ ఫోన్ పే యాప్ తో దుకాణదారున్ని బురిడీ కొట్టించిన దొంగ, వ్యాపారస్తులు పారా హుషారు
పలమనేరు: పట్టణం జవిలి వీధి నందు డైమండ్ ఫుట్‌వేర్ యజమాని మస్తాన్ తెలిపిన సమాచారం మేరకు. ఓ వ్యక్తి తన దుకాణంకి వచ్చి చెప్పులు కావాలని రెండు జతలు తీసుకున్నాడు జత 290చొప్పున ఇవ్వాల్సిందిగా కోరాను, బేరమాడి 250 చొప్పున రెండు జతలు తీసుకున్నాడు ఇంతవరకు అంతా బానే ఉంది. ఫోన్ పే చేస్తాను అనడంతో తన వద్ద ఉన్న స్కానర్‌ను చూపించాను అతని ఫోన్ పే నుండి తనకు 500అమౌంట్ క్రెడిట్ అయినట్టు మెసేజ్ చూపించి నేను చెక్ చేసే లోపల బైక్ లో వెళ్లిపోయాడు. చూడడానికి బ్యాగ్ తగిలించుకొని ఆఫీసర్ లాగా వచ్చి బురిడీ కొట్టించాడని వాపోయాడు. పలమనేర్ లో చాలామంది ఇతని బారిన పడ్డారని సమాచారం.