చిన్నచింతకుంట: ఇసుక, మట్టి అక్రమ తరలింపును ఆపాలి:బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్ బసిరెడ్డి సంతోశ్ రెడ్డి
మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంటలో రాత్రుళ్లు ఇసుక, పగటి పూట మట్టి అక్రమంగా తరలింపు జరుగుతోందని సోమవారం దేవరకద్ర నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్ బసిరెడ్డి సంతోశ్ రెడ్డి ఆరోపించారు. గ్రామాభివృద్ధి పేరుతో నాయకులు మాత్రమే లాభపడుతున్నారని అన్నారు. ప్రజల ఫిర్యాదులను అధికారులు పట్టించుకోరని అన్నారు. ఘటనపై స్థానిక ఎస్ఐ, తహశీల్దార్ కు ఫిర్యాదు అందిందని, చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు.