శ్రీరామ్ నగర్ రోడ్డుపై ప్రజల ఆవేదన – చిన్న వర్షానికే బురద మయమైన మార్గం
మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్ నగర్ రోడ్డులో చిన్న వర్షం కురిసినా కాలు పెట్టలేని పరిస్థితి నెలకొంది. రోడ్డంతా బురదతో కప్పుకుపోవడంతో వాహనదారులు జారిపడే ప్రమాదం ఎదుర్కొంటున్నారు. పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లడం కూడా కష్టంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డును శాశ్వతంగా సరిచేయాలని శ్రీరామ్ నగర్ వాసులు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు.