ఆళ్లగడ్డ: పెద్దయమ్మనూరుగ్రామంలో, ఘర్షణకు కారణమైన స్థలాన్ని పరిశీలించిన అధికారులు
నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండల పరిధిలోని పెద్దయమ్మనూరు గ్రామంలో ఇరు వర్గాల ఘర్షణ కారణమైన స్థలాన్ని ఆదివారం ఆళ్లగడ్డ టౌన్ సిఐ యుగంధర్, ఎస్సై రామిరెడ్డి, తాసిల్దార్ ప్రసాద్ బాబు, ఎంపీడీవో ఉమామహేశ్వరరావు పరిశీలించారు, స్థలానికి సంబంధించిన పత్రాలను కూడా వారు తనిఖీ చేశారు, అక్కడ ఉన్న స్థలం వైసీపీకి చెందిన వారిదా, గ్రామానికి చెందిన పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి వాస్తవాలను వెల్లడిస్తామన్నారు, గ్రామంలో ఎవరు కూడా ఘర్షణలకు పాల్పడరాదని సూచించారు.