అనంతపురం అర్బన్: రామగిరి సమీపంలోని చెర్లోపల్లి లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
Anantapur Urban, Anantapur | Apr 2, 2026
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం చెర్లోపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గుర్తు తెలియని కార్మికుడు నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్న అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దీంతో మృతదేహాన్ని పోస్ట్ మాత్రం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.