అనంతపురం అర్బన్: బత్తలపల్లి లో రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ఢీకొన్న ఆటో వృద్ధుడికి గాయాలు
Anantapur Urban, Anantapur | Apr 22, 2026
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండల కేంద్రంలో రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ఆటో ఢీకొన్న ఘటనలో పిన్నదరి గ్రామానికి చెందిన కాటమయ్య అనే వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి బుధవారం రాత్రి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.