కనిగిరి: పట్టణంలోని కూచిపూడిపల్లిలో వ్యక్తి ఆత్మహత్య, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
కనిగిరి: ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కనిగిరి పట్టణంలోని కూచిపూడిపల్లిలో శనివారం చోటు చేసుకుంది. ఎస్సై శ్రీరామ్ తెలిపిన వివరాల ప్రకారం... కూచిపూడి పలుకు చెందిన జొన్నలగడ్డ సుజన్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకుని సుజన్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీరామ్ తెలిపారు.