ఆళ్లగడ్డ: దిగువ అహోబిలంలో పవిత్రోత్సవాల పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహణ
ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి పవిత్రోత్సవాలలో భాగంగా సోమవారం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద పండితులు యాగశాలలో అధివాస హోమం నిర్వహించారు. దేవస్థానం ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాల్ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.