అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని కోనంపల్లి గ్రామ ప్రాథమికోన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు గూడూరు నరసింహప్ప కుమారులు గూడూరు హరికృష్ణ యాదవ్, గూడూరు శరత్, A.G.శ్రీనివాస రెడ్డి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు ప్రమీలమ్మ మరియు వారి కుమారుడు అనిల్ కలసి రూ. 1,60,000 మొత్తాన్ని వరండా పైకప్పు నిర్మించుటకు గాను విరాళం ప్రకటించడం జరిగింది. మొదటగా బుధవారం సాయంత్రం ఇరుకుటుంబాలు రూ. 1.2 లక్షల చెక్కులను అందించారని హెచ్ ఎం శ్రీనివాస్ నాయక్ పేర్కొన్నారు.