రాజమండ్రి సిటీ: మసాజ్ పేరుతో నిర్వహిస్తున్న వ్యభిచారం గుట్టురట్టు, 11 మందిని అదుపులోకి తీసుకున్న ప్రకాష్ నగర్ పోలీసులు
రాజమండ్రి ఏవీ అప్పారావు రోడ్డు లో ఉన్న ఓ మసాజ్ సెంటర్ పై పోలీసులు ఆదివారం రాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. స్పా, మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ దాడుల్లో నలుగురు యువతులు, ఐదుగురు విటులు, ఇద్దరు నిర్వాహకులతో సహా మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ప్రకాష్ నగర్ పోలీసులు.