నిర్లక్ష్యంగా లారీ నడిపి ముగ్గురు యువకుల మృతి...నిందితుడికి ఏడాది మూడునెలల జైలు శిక్ష
మదనపల్లి పట్టణంలో 2021లో ముగ్గురు యువకుల ప్రాణాలు బలిగొన్న రోడ్డు ప్రమాదం కేసులో న్యాయం గెలిచింది. నిర్లక్ష్యంగా లారీ నడిపి ప్రమాదం సృష్టించిన డ్రైవర్‌కు మదనపల్లి కోర్టు శిక్ష ఖరారు చేసింది.2021 ఫిబ్రవరి 12వ తేదీ రాత్రి 7.30 గంటల సమయంలో మదనపల్లి–తిరుపతి రోడ్డులోని సానిటోరియం హాస్పిటల్ వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులు — శ్రీహరి, తరుణ్ కుమార్ రెడ్డి, ధనుష్ —ను ఎదురుగా అతివేగంగా, అజాగ్రత్తగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదానికి రాయచోటి మండలం కొత్తపేటకు చెందిన లారీ డ్రైవర్ ఎస్. మహబూబ్ బాషా అలియాస్ క