బనగానపల్లె: ప్రత్యేక పుష్పాలంకరణలో నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారు
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందవరం శ్రీచౌడేశ్వరి దేవి అమ్మవారు ఆదివారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈవో శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో అర్చకులు అమ్మవారికి రుద్రాభిషేకం, మహామంగళహారతి నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్య క్రమాల అనంతరం ఆలయ అధికారులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు