అల్లాదుర్గం: అల్లాదుర్గం ఐబి చౌరస్తా వద్ద ఇంటి నిర్మాణం చేస్తున్న మేస్త్రీ కరెంట్ షాక్‌తో మృతి
మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంటి నిర్మాణం చేస్తుండగా మేస్త్రి కరెంట్ షాక్ తో మృతి చెందాడు. మృతుడు రేగోడు మండలం ఆర్ ఇటిక్యాల గ్రామానికి చెందిన బాలరాజుగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి 108 అంబులెన్స్ సహాయంతో తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.