జహీరాబాద్: చిరాగ్ పల్లి అంతరాష్ట్ర చెక్పోస్ట్ వద్ద గోవా నుండి అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం చిరాగ్ పల్లి అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద అక్రమ మద్యం పట్టుకున్నట్లు ఆదివారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో ప్రకటనలో ఎక్సైజ్ ఎస్ఐ కోటేశ్వరరావు తెలిపారు. అంతరాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ వద్ద ఆదివారం వాహనాల తనిఖీ చేపట్టగా ట్రావెల్స్ బస్సులతో పాటు వివిధ వాహనాల్లో అక్రమంగా గోవా నుండి రాష్ట్రానికి తరలిస్తున్న 36 మద్యం బాటిల్లను గుర్తించి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.