గుంతకల్లు: గుత్తి ఆర్టీసీ బస్టాండ్ లో మహిళా ప్రాయానికురాలి మూడు తులాల బంగారు నెక్లెస్ అపహరణ, పోలీసులకు ఫిర్యాదు
గుత్తి ఆర్టీసీ బస్టాండ్ లో ఆదివారం రాత్రి గౌతమి అనే మహిళకు చెందిన మెడలోని మూడు తులాల బంగారు నెక్లెస్ చోరీ జరిగింది. కర్ణాటక రాష్ట్రం తోర్నగల్లు కు గౌతమి గుత్తిలోని బంధువుల ఫంక్షన్కు వచ్చింది. తిరిగి వెళుతున్న సమయంలో బస్టాండ్లో బస్సు ఎక్కేటప్పుడు దొంగలు ఆమె మెడలోని మూడు తులాల బంగారు నెక్లెస్ ను ఎత్తుకెళ్లారు. బాధితురాలు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.