జహీరాబాద్: అల్గోల్ చౌరస్తా వద్ద కారు - బైక్ ఢీ వ్యక్తికి గాయాలు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ శివారులోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం అల్గోల్ చౌరస్తా వద్ద రోడ్డు దాటుతున్న బైక్ హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు ఢీకొన్నాయి. ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలు కాగా వెంటనే పెట్రోలింగ్ పోలీసులు క్షతగాత్రుని ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.