కొండమల్లేపల్లి: మండల కేంద్రంలో పందుల గుంపును తప్పించబోయి డివైడర్ ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు, త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
నల్గొండ జిల్లా, కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మాచర్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఎదురుగా వస్తున్న పందుల గుంపును తప్పించబోయి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో డివైడర్ వెంట ఉన్న బ్యారి గేట్లు, మొక్కలు ధ్వంసమయ్యాయి. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.