రాజేంద్రనగర్: బాలాపూర్ లో స్నేహితుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించి కలకలం రేపిన ఘటన
బాలాపూర్లో దారుణం జరిగింది. మందు తాగుదామని చెప్పి స్నేహితుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన కలకలం రేపింది. ఎర్రకుంటకు చెందిన ఆటోడ్రైవర్ అబ్దుల్ ఫతేలి (32) 50% కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.నిందితులు జహంగీర్, కరీంలపై బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.