బనగానపల్లె: కొలిమిగుండ్లలో విద్యుత్ హై టెన్షన్ లైన్ల కారణంగా సాగు పనులకు ఆటంకం కలుగుతుందంటూ మంత్రి బిసి కి రైతుల వినతి
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండల రైతులు సోమవారం బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కలిసి తమ సమస్యను వివరించారు. పొలాల గుండా వెళ్తున్న 22 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ల కారణంగా సాగు పనులకు ఆటంకం కలుగుతోందని, పని చేయడానికి భయపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.రైతుల ఆవేదనను విన్న మంత్రి తక్షణమే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.