కర్నూలు: ఎస్సీ,ఎస్టీ కేసులో ఐదు మందికి జైలు శిక్ష : కర్నూల్ ఎస్సీ ఎస్టీ విభాగం జడ్జి తుది తీర్పు వెల్లడి
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ఐదుగురికి జైలు శిక్ష విధిస్తూ కర్నూల్ ఎస్సీ ఎస్టీ విభాగం జడ్జి శ్రీ వాసు శుక్రవారం తీర్పు వెలువరించారు. ఎస్సీ ఎస్టీ కేసులో ఐదు మందికి తొమ్మిది సంవత్సరాలు రెండు నెలల జైలు శిక్షతోపాటు జరిమానాలు కూడా విధించారు.కర్నూలు నాలుగో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో 2018లో చోటుచేసుకున్న రెండు వేర్వేరు ఘటనల్లో గోవిందమ్మ కుటుంబాన్ని కులం పేరుతో దూషించి, దాడికి పాల్పడిన నేసే శ్రీనివాసులు, నేసే రాజు, నేసే సరోజ,నేసే నాగజ్యోతి, నేసేవెంకటేష్లపై కేసులు నమోదయ్యాయి.అప్పటి ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ మురళీధర్ రెడ్డి, వినోద్ కుమార్ నేతృత్వంలో పోలీసులు సమగ్రంగా దర్యాప