ఎడపల్లి: అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్న రుద్రూరు పోలీసులు
వర్ని: అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు రాయాకూర్ గ్రామం నుండి సులేమాన్ గ్రామం మీదుగా ఓవర్ లోడ్ తో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఎస్సై మహేందర్ పట్టుకున్నారు. ఎస్సై ఆ ట్రాకర్లను స్వాధీనం చేసుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించడం జరిగిందన్నారు. అనుమతులు లేకుండా అక్రమంగా మొరం, ఇసుక తరలించినట్లయితే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని ఎస్సై మహేందర్ తెలిపారు.