నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో ఆర్టీసీకి ఎండ దెబ్బ
Nandyal Urban, Nandyal | Apr 17, 2026
నంద్యాల జిల్లాలో ఆర్టీసీకి ఎండల దెబ్బ తాగుతోంది. రోజురోజుకూ అధికమవుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడానికి ప్రజలు ఆసక్తి చూపడం లేదు. రాష్ట్రంలోనే అత్య ధికంగా ఇప్పటికే NDL జిల్లాలో 44.4° ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఎండల దెబ్బకు ప్రజలు 10 గంటలు దాటితే బయటికి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. నిన్న మొన్నటి వరకు ఉచిత బస్సుతో కిటకిటలాడిన ఆర్టీసీ బస్సులు నేడు వెలవెల బోతున్నాయి.