ఒంగోలు అర్బన్: ఒంగోలులో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు
Ongole Urban, Prakasam | Apr 24, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో శుక్రవారం లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ రావు ప్రారంభించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని మంచినీటితో పాటు మజ్జిగ కూడా ఈ లైన్స్ క్లబ్ చలివేంద్రం పంపిణీ చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు. ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలు తమ దాహాన్ని తీర్చుకోవాలి అన్నారు. భవిష్యత్తులో మరికొంతమంది దాతలు ఇలానే ముందుకు వచ్చి ప్రజల దాహార్తిని తీర్చేందుకు దాతలు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే దామచర్ల అన్నారు.