డోన్: బేతంచెర్ల మండలంలో చిత్తకుప్పగా మారిన పురాతన భావి
Dhone, Nandyal | Jun 3, 2026 బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామం కొండపేట కాలనీలోని అతి పురాతనమైన బావి చెత్తాచెదారంతో కనుమరుగవుతోంది. ఒకప్పుడు ప్రజల దాహార్తిని తీర్చిన ఈ బావి నేడు వ్యర్థాలతో నిండిపోయింది. పంచాయతీ అధికారులు స్పందించి ఈ బావిని శుభ్రపరచాలని స్థానికులు కోరుతున్నారు. వర్షాకాలంలో ఈ బావి నీటితో నిండితే చుట్టుపక్కల బోరుబావుల్లో భూగర్భ జలాలు పెరుగుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.