అమరావతి, క్రోసూరు గ్రామాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లింలు.
పల్నాడు జిల్లా, పెడకూరపాడు నియోజకవర్గంలోని ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రోసూరు, అమరావతి గ్రామాల్లోని ముస్లింలు గురువారం ఉదయాన్నే ఈద్గాల వద్దకు చేరుకొని, చిన్నా , పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ నూతన వస్త్రాలు ధరించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నియోజకవర్గంలో ప్రజలు ఆనందంగా ఉండాలని అల్లాని కోరారు. ఒకరినొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు..