బనగానపల్లె: పాతపాడు లో రైతులకు పాస్ పుస్తకాల పంపిణీ
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం పాతపాడు గ్రామంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. టీడీపీ నాయకులు, మాజీ సర్పంచ్ మహేశ్వర్ రెడ్డి, సంగు శంకేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులకు భూ హక్కు పత్రాలు అందజేశారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి, వారి హక్కుల రక్షణకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.