కర్నూలు: ట్రంప్ సుంకాలకు వ్యతిరేకంగా రైతుల ఆగ్రహం.. ట్రంప్ దిష్టిబొమ్మ దగ్ధం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన ఉగ్రసుంకాలను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా వ్యాప్తంగా రైతులు నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా ట్రంప్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ — ట్రంప్ సుంకాల వల్ల భారత వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింటుందని, అమెరికా ఒత్తిడికి లోనై కేంద్రం సుంకాలు తగ్గిస్తే కోట్లాది మంది రైతులు, పాడి, కోళ్ల పరిశ్రమలు నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.అమెరికాలో రైతులకు విపరీతమైన సబ్సిడీలు అందుతుండగా, భారత రైతులకు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయని ఆయన విమర్శించారు. సుంకాల వల్ల