కరీంనగర్: పొలం నుంచి ఇంటికి వచ్చే క్రమంలో బైక్ పైనుంచి అదుపుతప్పి కింద పడి ఓ రైతుకు తీవ్ర గాయాలు, చికిత్స పొందుతూ మృతి
పొలం నుంచి ఇంటికి వచ్చే క్రమంలో బైక్ పై నుంచి అదుపుతప్పి కింద పడి ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో గత రాత్రి మృతి చెందినట్లు బుధవారం కుటుంబ సభ్యులు తెలిపారు. అసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం పోతేపల్లి లో నారాయణ అనే వ్యక్తి పొలం వద్దకు బైక్ పై వెళ్లి వస్తూ ఉండగా కింద పడడంతో తీవ్ర గాయాలు కాగా కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.