నంద్యాల అర్బన్: నంద్యాలలో ఘనంగా కూటమిపాలన విజయోత్సవ సభ
Nandyal Urban, Nandyal | Jun 13, 2026
నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయినసందర్భంగా విజయోత్సవ వేడుకలు శనివారంఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి పరుక్ హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం రెండు సంవత్సరాల కాలంలో తీసుకొచ్చిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకోవాలని టిడిపి శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు