కేసముద్రం: సైబర్ మోసాలు,రోడ్డు భద్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి,కోమటిపల్లిలో చట్టాలపై అవగాహన సదస్సులో,కేసముద్రం SI మురళీధర్ రాజు
ఇటీవల జరుగుతున్న సైబర్ మోసాల పట్ల,ప్రజల అప్రమత్తంగా ఉండాలని,అదేవిధంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని,కేసముద్రం ఎస్సై మురళీధర్ రాజు అన్నారు. జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపిఎస్ ఆదేశాల మేరకు,కేసముద్రం పిఎస్ పరిధిలోని, కోమటిపల్లి గ్రామంలో చట్టాలు మరియు రోడ్డు భద్రతపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు, సైబర్ నేరగాళ్లు పాల్పడుతున్న పలు విధాల మోసాలను ప్రజలకు వివరించి అప్రమత్తం చేసారు.